Mobile Popup Ad
Mobile Popup Ad

గురుభక్తిని చాటుకున్న పుతిన్.. టీచర్‌ను హగ్ చేసుకుని, విందుకు తీసుకెళ్లి!

కలం, వెబ్ డెస్క్: ఆయనో దేశానికి అధ్యక్షుడు.. అయితేనేం చదువు నేర్పిన గురువును మర్చిపోలేదు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆయన తన షెడ్యూల్‌ను పక్కన పెట్టి మరీ, గురువు కోసం ప్రత్యేక సమయం కేటాయించాడు. ఆయనే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin). తన గురువు పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుని అందరినీ ఆకట్టుకున్నారు. తన చిన్ననాటి ఉపాధ్యాయురాలు వీరా గురేవిచ్‌ను కలిసేందుకు స్వయంగా కారు నడుపుకుంటూ ఆమె నివాసానికి వెళ్లారు. అక్కడ తన టీచర్‌ను ఆత్మీయంగా హగ్ చేసుకుని, కారులో కూర్చోబెట్టి అధ్యక్ష నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు తీసుకువెళ్లారు.

ఎంతటి ఉన్నత శిఖరాలకు ఎదిగినా, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువులను మర్చిపోకూడదనే మంచి సందేశాన్ని పుతిన్ చాటిచెప్పారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుతిన్‌ తీరుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>