Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులకు శుభవార్త.. పీఎంకేవై నిధుల విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) బుధవారం పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఏటా మూడు విడతల్లో 2 వేల చొప్పున సాయం అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 21వ విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరు(Coimbatore)లో జరిగిన భారీ బహిరంసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. తొమ్మిది కోట్ల మంది రైతులకు రూ.18 వేల కోట్లకు పైగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో చేరనున్నాయి.

పీఎం కిసాన్‌(PM Kisan Yojana) నిధులు జమ అవుతాయని సమాచారం రావడంతో అనేక ప్రాంతాల్లో రైతులు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొన్నిచోట్ల బ్యాంకుల ముందు పొడవైన బారులు కనిపించాయి. ఖాతాల్లో డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికే ఎక్కువ మంది రావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన పీఎం కిసాన్‌ పథకం దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6,000 సాయం అందజేస్తున్నారు. నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా నగదు జమ అవుతోంది. ఇప్పటి వరకు 20 విడతల ద్వారా ప్రభుత్వం మొత్తం రూ.3.70 లక్షల కోట్లకుపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో చేసిందని కేంద్రం చెప్పింది.

Read Also: బిహార్‌లో గెలిచేదాకా కొట్లాడతా.. వ్యూహకర్త డ్యూటీకి గుడ్ బై : ప్రశాంత్ కిషోర్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>