epaper
Monday, March 2, 2026
epaper

ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్‌

తమ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)ను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో హసీనా అప్పగింత కోరుతున్న బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ సహకరించడం లేదు. దీంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రస్తుతం హసీనా, అలాగే బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. వారి అప్పగింతకు ఇంటర్‌పోల్(Interpol) సహాయాన్ని తీసుకోవాలన్న ఆలోచన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉందని అక్కడి మీడియా నివేదించింది.

ఈ దిశగా విదేశాంగ శాఖ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. దేశం విడిచి పారిపోయిన ఈ ఇద్దరి(Sheikh Hasina, Asaduzzaman Khan) మీద రెడ్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించేందుకు ప్రాసిక్యూటర్ గాజీ తమీమ్ సన్నాహాలు చేస్తున్నారని ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అంతర్జాతీయ నేరాల విచారణ ట్రైబ్యునల్ ఇప్పటికే అరెస్ట్ వారెంట్‌తో పాటు అవసరమైన పత్రాలను ఇంటర్‌పోల్‌కు పంపినట్టుగా సమాచారం.

Read Also: ఉగ్రవాదిని చితకబాదిన తోటి ఖైదీలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!