కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని మోదీ (PM Modi) కుండబద్దలు కొట్టారు. కోల్ కతాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. “బెంగాల్ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే.. వాటిని దళితులు, అణగారిన వర్గాలకు అందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటూ వస్తోంది. మే 4న ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంతో ఈ సమస్యలకు శాశ్వతంగా ముగింపు పడనుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సహా అందరికీ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు దక్కబోతున్నాయి” అని పేర్కొన్నారు.
విద్యార్థులు చదువులు వదిలేసి..
ప్రధాని మోదీ (PM Modi) తన ప్రసంగంలో జాదవ్ పుర్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఈ విశ్వవిద్యాలయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. జాతీయ భావాలకు ఇది పుట్టినిల్లు. అలాంటి వర్సిటీని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. విద్యార్థులు చదువులు వదిలేసి, బలవంతంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చింది. మనకు కావాల్సింది అల్లర్లు కాదు, చదువుకునే వాతావరణం. మనకు గొడవలు వద్దు. చర్చలు కావాలి. ఒక్క యూనివర్సిటీనే కాపాడలేని టీఎంసీ ప్రభుత్వం, ఇక బెంగాల్ యువత భవిష్యత్తును ఎలా కాపాడుతుంది?” అని ప్రశ్నించారు.
Read Also: షాకింగ్.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
Follow Us On : WhatsApp

