స్మిత్ మచ్ఛర్ సాహసం అద్భుతం: ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: భారత పైలట్ స్మిత్ మచ్ఛర్ అద్భుతమైన సాహసం చేసి వందల మంది ప్రాణాలను కాపాడారని ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసించారు. ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడిని మీ ఇండియన్ పైలట్ తప్పించాడని ప్రధాని నెతాన్యాహూ తనకు చెప్పారని మోదీ వివరించారు. ప్రపంచమంతా స్మిత్ మచ్ఛర్‌ను అభినందిస్తోందన్నారు. ఉదయమే తాను స్మిత్ తల్లిదండ్రులు గాయత్రి, భూపేంద్ర, అతడి భార్య సోనాల్‌తో మాట్లాడానని తెలిపారు. స్మిత్ సాహసాన్ని చూసి దేశం గర్విస్తోందని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. దేశ ప్రజలు కూడా అతడికి మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థించాలన్నారు. ఎంతో ఓపిక, సమయస్ఫూర్తి, ధైర్యంతో పెద్ద ప్రమాదం నుంచి రక్షించారని కొనియాడారు.

యూపీఎస్సీ కొన్ని కోట్ల మంది కల..

యూపీఎస్సీ శతాబ్ధి ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యూపీఎస్సీ అనేది కొన్ని కోట్ల మంది యువత కల అన్నారు. గత వందేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, తరాలు, టెక్నాలజీ, పరీక్ష సిలబస్‌లు మారాయయని.. కానీ, యూపీఎస్సీ మీద యువతకు ఉన్న నమ్మకంలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. వందేళ్ల ప్రయాణంలో భాగస్వామ్యులైన యూపీఎస్సీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశానికి అత్యంత సమర్థులైన అధికారులను అందించేందుకు యూపీఎస్సీ నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. సివిల్స్ పరీక్షల్లో 30 శాతం మంది మహిళలు ఉన్నారని.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగాలన్నారు. నకిలీ దరఖాస్తులను అరికట్టేందుకు ఏఐని కూడా వాడుతున్నట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>