కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణను దేశపు ప్రధాన తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. హెచ్‌ఐసీసీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి గతిని మార్చడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణను కీలక భాగస్వామిని చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అత్యాధునిక ఐసీటీ నెట్‌వర్క్ సౌకర్యంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ వ్యవస్థలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులను ఒకే చోట అందిస్తాయి. మెరుగైన కనెక్టివిటీ ద్వారా రవాణా రంగం బలోపేతం అవుతుందని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి మార్గాలు సుగమం అవుతాయని ప్రధాని వెల్లడించారు.

