epaper
Wednesday, February 18, 2026
epaper

కాంగ్రెస్​కు తెలిసింది అవినీతి ఒక్కటే: పీఎం మోదీ

కలం, వెబ్​డెస్క్​: దేశం కోసం కాంగ్రెస్​ ఎప్పుడూ పనిచేయలేదని, ఆ పార్టీకి తెలిసింది కేవలం అవినీతి మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు (PM Modi). రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం అసోం (Assam) చేరుకున్న పీఎం మోదీ రూ.5,500 కోట్లకుపైగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్​ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. అసోం బాగు కోసం అవసరమైన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. దేశ భద్రతను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. తుక్డే తుక్డే గ్యాంగ్​కు కాంగ్రెస్ మద్దతిస్తోందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఐదేళ్లలో ఐదు వంతెనలు నిర్మించిందని చెప్పారు. అక్రమ చొరబాట్లను గణనీయంగా తగ్గించిందన్నారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్​ ఫెసిలిటీ..

అంతకుముందు అసోంలోని మోరాన్​లో (Moran Assam) ఏర్పాటు చేసిన మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్​ ఫెసిలిటీ ( ELF)పై ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన విమానం ల్యాండైంది. ఉదయం చాబువా చాబువా ఎయిర్‌ఫీల్డ్​లో దిగిన ఆయన అక్కడి నుంచి ఎయిర్​ఫోర్స్​కు చెందిన C-130J విమానంలో ప్రయాణించి, మోరాన్ బైపాస్‌పై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీకి చేరుకున్నారు. ఇందులో గరిష్ఠంగా 40 టన్నుల బరువున్న యుద్ధవిమానాలు, అలాగే 74 టన్నుల గరిష్ఠ టేకాఫ్ బరువు గల రవాణా విమానాలు టేకాఫ్​, ల్యాండింగ్​ చేయొచ్చు.

చైనా సరిహద్దుకు అత్యంత దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో, 4.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ELF ఏర్పాటుచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్​ నేవీకి చెందిన యుద్ధ విమానాలు టేకాఫ్,ల్యాండింగ్ చేయగలిగేలా ప్రత్యేకంగా జాతీయ రహదారిని ఇక్కడ ఈఎల్​ఎఫ్​ పేరుతో అభివృద్ధి చేశారు. అంతేకాదు అసోంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి, ప్రకృతి విపత్తుల్లో సహాయానికి తోడ్పడనుంది. ఈఎల్​ఎఫ్​ ప్రారంభించడాన్ని చారిత్రాత్మక ఘట్టంగా ప్రధాని మోదీ (PM Modi) అభివర్ణించారు.

కాగా, 40 నిమిషాలపాటు జరిగిన ఎయిర్​ఫోర్స్​ మెగా ఎయిర్​షోను ప్రధాని తిలకించారు.
అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తదితరులు హాజరయ్యారు.

Read Also: ముంబ‌యిలో కుప్ప‌కూలిన మెట్రో పిల్ల‌ర్‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>