Mobile Popup Ad
Mobile Popup Ad

ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదు

కలం, వెబ్ డెస్క్ : దక్షిణ ఇటలీ  తీర ప్రాంతంలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా భూకంపం (Italy Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసెన్సెస్ వెల్లడించింది. భూకంపం కేంద్రం భూమి ఉపరితలం నుంచి దాదాపు 253 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది.

అయితే భూకంపం కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాసేపు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి మాములు స్థితికి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం తీవ్రంగా నమోదైనప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక నివేదికలు వెలువడలేదు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>