తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కీల‌క నిర్ణ‌యం

కలం, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్య‌క్ష‌త గురువారం సాయంత్రం జ‌రిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు నవంబర్ నెలాఖరులోగా రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించిన తేదీలు ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.

కాళేశ్వరం పరివాహక జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు గోదావరి నదిని సందర్శించాల‌ని సీఎం (Revanth Reddy) ఆదేశించారు. గోదావ‌రిలో నీటి ప్రవాహం, ఎత్తిపోతల ప్రక్రియపై క్షేత్రస్థాయి వివరాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ప్రాజెక్టుకు చేపడుతున్న మరమ్మతుల గురించి వివ‌రించాల‌ని చెప్పారు. కాళేశ్వరం నుంచి ఏపీకి నీటిని తరలించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

Also Read : పారా అథ్లెట్లపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>