పీఎం శ్రీ కార్యక్రమంలో వినూత్న విద్యా పర్యటన

కలం, ఎర్రుపాలెం: పీఎం శ్రీ కార్యక్రమంలో(PM SHRI Programme) భాగంగా ఎర్రుపాలెం గురుకుల పాఠశాల విద్యార్థినులు గురువారం వరంగల్‌లో పారిశ్రామిక విజ్ఞాన యాత్రను విజయవంతంగా నిర్వహించారు. పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఈ పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా విద్యార్థినులు కాకతీయ టెక్స్టైల్స్ పరిశ్రమతో పాటు ‘ఏబీసీ’ బ్యూటీ పార్లర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియలు, యంత్రాల పనితీరు, నైపుణ్యాల గురించి ప్రత్యక్షంగా అవగాహన పొందారు. అలాగే బ్యూటీ అండ్ వెల్‌నెస్ రంగంలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు, వృత్తి నైపుణ్యాల గురించి తెలుసుకున్నారు.

కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థినులకు క్షేత్రస్థాయి అనుభవం కల్పించడం, వారిలో సృజనాత్మకత, పరిశీలనా శక్తి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధిపై అవగాహన పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఇటువంటి పారిశ్రామిక పర్యటనల ద్వారా విద్యార్థినులు వివిధ రంగాల్లోని పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, నూతన విషయాలను నేర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో తమ ఆసక్తికి అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పీఎం శ్రీ కార్యక్రమం ద్వారా ఇటువంటి వినూత్న విద్యా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ చావా జ్యోతి పేర్కొన్నారు. ఈ యాత్రలో ఉపాధ్యాయులు తేజావత్ ధనలక్ష్మి, శిరీష, స్వాతి, రమాదేవి, సల్మా, స్రవంతి, మేరీ లీనా, విద్యార్థినులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>