కలం, వెబ్‌డెస్క్: ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas) లో కాఫీ కప్స్‌లో జరుగుతున్న మోసం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటకలో ఓ కస్టమర్ తనకు జరిగిన అనుభవాన్ని లైవ్‌లో ప్రూవ్ చేస్తూ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. రూ.300, అంతకంటే ఎక్కువ ధర వసూలు చేస్తూ, వేరొకరు ఉపయోగించిన గ్లాసుల్లోనే కాఫీ, టీ లాంటి డ్రింక్స్ అందిస్తున్నారని ఆరోపించారు. గౌరవ్ అనే వ్యక్తి నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రీమియం ధరలు వసూలు చేస్తున్నప్పటికీ, వినియోగదారులకు తగిన పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని గౌరవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో మల్టీప్లెక్స్‌లలో పరిశుభ్రత ప్రమాణాలు, కస్టమర్ల ఆరోగ్య భద్రతపై చర్చ మొదలైంది. ఉపయోగించిన గ్లాసులను తిరిగి వినియోగించే ముందు సరైన విధంగా శుభ్రం చేస్తున్నారా? వాటిని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, కస్టమర్ చేసిన ఆరోపణలపై సంస్థ స్పందనకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

