కాంగ్రెస్ కు కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ (PM Modi) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ MMCగా మారిందని విమర్శలు గుప్పించారు. MMC అంటే ముస్లిం లీగ్‌ మావోవాది కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. అయితే దేశమంతా మావోయిస్టులు అంతమైనా తెలంగాణలో ఇంకా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మావోయిస్టులను కాంగ్రెస్ బతికిస్తుందని ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని మోదీ చెప్పుకొచ్చారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఇక్కడ కూడా మావోయిస్టులను అంతం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో మావోయిస్టులను అంతం చేయాలంటే బీజేపీ పాలన రావాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>