హైద‌రాబాద్ వేదిక‌గా దేశానికి మోదీ కీల‌క విజ్ఞప్తులు

క‌లం, వెబ్‌డెస్క్‌: సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌రుగుతున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ (PM Modi) దేశానికి కీల‌క విజ్ఞప్తులు చేశారు. ప్ర‌పంచ‌మంతా సంక్షోభంలో ఉంద‌ని మోదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌ష్ట‌కాలంలో మ‌న‌మంతా ఏక‌మై ఉండాల‌ని పిలుపునిచ్చారు. అవ‌స‌ర‌మైతే త్యాగాల‌కు కూడా సిద్ధం కావాల‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లంతా త్యాగాలు చేసి దేశ భ‌క్తిని చాటాల‌ని కోరారు. దేశంలో క‌రోనా లాంటి క్లిష్ట స‌మ‌యాన్ని ఎదుర్కొంటున్నాం అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు తొమ్మిది విజ్ఞప్తులు చేశారు. అంత‌ర్జాతీయంగా ముడి చమురు ధ‌ర‌లు బాగా పెరిగాయ‌ని, వాహ‌న‌దారులు పెట్రోల్‌, డీజిల్ ప‌రిమితంగా వినియోగించాల‌ని మోదీ కోరారు.

ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువ‌గా వినియోగించాల‌ని, వీలైతే మెట్రోలో ప్ర‌యాణం చేయాల‌ని కోరారు. ప్ర‌జ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెంచాల‌ని సూచించారు. దుబారా ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌ని, ఆడంబ‌రాల‌కు పోవ‌ద్ద‌ని కోరారు. విదేశీ ప్ర‌యాణాల‌ను కూడా త‌గ్గించుకోవాల‌ని మోదీ సూచించారు. ఏడాది పాటు బంగారం కొన‌కుండా శ‌ప‌థం చేయాల‌ని కోరారు. ప్ర‌తి కుటుంబం వంట నూనె వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని సూచించారు. రైతులు ఎరువులు, ర‌సాయ‌నాల వినియోగాన్ని స‌గానికి స‌గం త‌గ్గించాల‌ని సూచించారు. ఆన్‌లైన్ మీటింగులు, వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంల‌కు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>