epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విపక్ష ఎంపీలతో ప్రధాని ‘చాయ్‌ పే చర్చ’

కలం, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభకు రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ 11 గంటలకు హాజరయ్యారు. సెషన్ ప్రారంభమైన వెంటనే ఆయన సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, “నిన్న మంత్రి సమాధానం ఇచ్చే సమయంలో సభ్యుల ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేయడం, పత్రాలను చింపివేయడం వంటివి సరికాదన్నారు. సభ్యులు తమ ప్రవర్తనపై పునరాలోచించాలని సూచించారు. ఈ సెషన్ చాలా ఉత్పాదకంగా సాగిందన్నారు.

ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ విపక్ష ఎంపీలతో చాయ్ పే చర్చ (Chai Pay Charcha)  నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రియాంకా గాంధీ, పలువురు విపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. సాధారణంగా అధికార మరియు విపక్ష పార్టీలు పార్లమెంట్‌లో విభిన్న అంశాలపై అధికారికంగా చర్చలు జరుపుతాయి. ఈ సారి కూడా సమావేశాలు కాస్త వాడీవేడిగా సాగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పుపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>