Mobile Popup Ad
Mobile Popup Ad

విమానంలో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: నేపాల్ (Nepal) రాజధాని ఖాట్మాండులో భారీ ప్రమాదం తప్పింది. ఇస్తాంబుల్ నుంచి త్రిభువన్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ఎయిర్‌బస్-330 విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ అవుతుండగా, కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేసి.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా దింపివేశారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 270 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

విమానాశ్రయం మూసివేత.. విచారణకు ఆదేశం..

ఈ ఘటన ఉదయం 6.14 గంటలకు చోటు చేసుకోగా.. గంటన్నర పాటు విమానాశ్రయాన్ని పూర్తిగా మూసేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సివిల్ ఏవీయేషన్ శాఖ ప్రకటించింది. ఉదయం పూట మంచు కారణంగానే ల్యాండ్ చేసే క్రమంలో ఇది చోటు చేసుకున్నట్లు పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>