కలం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్(New Zealand)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. ఇక నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువలుపై దిగుమతి సుంకం ఉండబోదన్నారు. తద్వారా దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, చేనేత రంగాలకు గరిష్ఠ ప్రయోజనం కలగబోతుందన్నారు.
కొత్త ఒప్పందంతో యువతకు కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అంగీకారం కుదిరిందన్నారు. ఈ నిర్ణయంతో భారత్‌లో న్యూజిలాండ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో పాటు తయారీ రంగానికి మూలధనం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుతుందన్నారు.
పాల ఉత్పత్తి రంగం మినహాయింపు..
భారత్‌కి న్యూజిలాండ్ ఎగుమతి చేసే రంగాల నుంచి పాల ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా మినహాయించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. డెయిరీ ఉత్పత్తి రంగాల్లో ఎలాంటి మార్కెట్ యాక్సెస్ కల్పించబోమని.. అంతిమంగా దేశీ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. అదే సమయంలో చక్కెర, తేనె, మొక్కజొన్న, బాదం, బఠానీలు, శనగలు వంటి కీలక ఆహార ఉత్పత్తులకు కూడా షరతులు విధించినట్లు వివరించారు. అత్యంత సున్నితమైన ఆహార రంగాల్లో న్యూజిలాండ్ దేశానికి ఎలాంటి ప్రత్యేక రాయితీలు కల్పించలేదని వెల్లడించారు.
Also Read : ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?
Follow Us On: X(Twitter)

