కలం, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట (Wardhannapet) ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహణ లోపం తీవ్ర స్థాయికి చేరుకుంది. డెడ్‌బాడీలను భద్రపరిచే మార్చురీలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాయపర్తిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గారె వీరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
మార్చురీలో విద్యుత్ లేకపోవడం, నిర్వహణ కొరవడంతో మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. కంటి భాగం వద్ద చర్మాన్ని తొలిచేశాయి. ఆదివారం కుటుంబసభ్యులు ఈ విషయాన్ని గుర్తించారు. దీనిపై ఆస్పత్రిలో వైద్యులను, సిబ్బందిని ప్రశ్నించగా ఎవరూ పట్టించుకోలేదు. మృతదేహాలు అయినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని గారె వీరయ్య బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?
Follow Us On: Instagram

