హిందూ పండుగల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు : సునీల్ రావు

కలం, ​కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సమస్య పరిష్కారానికి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని చింతకుంట కెనాల్ వద్ద గణేష్ నిమజ్జన వేడుకలకు నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన సోమవారం భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో హిందూ పండుగల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ​

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి చింతకుంట ఎస్సారెస్పీ వరద కాలువకు నీటిని విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన సునీల్ రావు వ్యక్తం చేశారు. గతంలో ఎస్సారెస్పీలో కేవలం 15 టీఎంసీల నీరు ఉన్నప్పుడే నిమజ్జనాల కోసం నీటిని విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 47 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని వదలకుండా హిందువులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం అర టీఎంసీ నీటిని వరద కాలువకు వదిలితే కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు పరివాహక ప్రాంతాల ప్రజలందరి నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతాయని సునీల్ రావు తెలిపారు. ​కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి నీటిని విడుదల చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి, ఎల్ఎండి నుండి తమ సొంత ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లారని, మరి కరీంనగర్ జిల్లా ప్రజల పరిస్థితి ఏమిటని డిప్యూటీ మేయర్ నిలదీశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం తమ జిల్లాకే మంత్రిగా వ్యవహరిస్తున్నారా లేదా రాష్ట్రమంతటికీ పనిచేస్తున్నారా అని సునీల్ రావు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ​ఇతర మతాల పండుగలకు నిధులు కేటాయించి ప్రోత్సహించినప్పుడు తాము ఎప్పుడూ ప్రశ్నించలేదని చెప్పారు. కానీ హిందువుల పండుగలపై ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయడం సరికాదని సునీల్ రావు హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి తక్షణమే స్పందించి నిమజ్జనాలకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి: మంత్రి ఉత్తమ్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>