Mobile Popup Ad
Mobile Popup Ad

జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: టీడీపీ నాయ‌కుల జంట హ‌త్య‌ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న‌ వైసీపీ నాయ‌కుడు, గుర‌జాల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నేడు జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వైసీపీ (YCP) శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గుండ్ల‌పాడులో టీడీపీ నేత‌ల జంట హ‌త్య కేసులో పిన్నెల్లి ఏ6గా ఉన్నారు. ఈ కేసులో 98 రోజుల పాటు నెల్లూరు జైలులో (Nellore Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న‌ పిన్నెల్లి విడుద‌ల‌తో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లిని పార్టీ శ్రేణులు భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్లారు.

ఈ సంద‌ర్భంగా పిన్నెల్లి (Pinnelli Ramakrishna) మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి తీవ్ర హెచ్చ‌రికలు జారీ చేశారు. టీడీపీ ఆధిపత్య పోరులో హత్య జరిగితే, అది త‌న‌కు ఆపాదించి జైలులో పెట్టార‌న్నారు. రేపు త‌మ‌కూ టైమ్ వస్తుంద‌ని, తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామ‌ని హెచ్చ‌రించారు. ఉద్దేశపూర్వ‌కంగా త‌న‌ను టార్గెట్ చేసి, అక్ర‌మ కేసులు పెట్టార‌న్నారు. త‌మ‌ను అన్యాయంగా మాన‌సిక క్షోభ‌కు గురి చేసిన వారికి బుద్ది చెప్తామ‌ని పేర్కొన్నారు.

Read Also: ఆ ఐదేళ్లూ పండుగలు జరుపుకోలేని పరిస్థితి: CM చంద్రబాబు

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>