epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

“ఫూలే” మూవీ స్పెషల్ స్క్రీనింగ్ .. చీఫ్ గెస్ట్స్ ఎవరంటే ?

కలం, సినిమా : సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule), సావిత్రిబాయి ఫూలే(Savitribai Phule) జీవితాలపై వచ్చిన హిందీ చిత్రం ‘ఫూలే'(Phule) . అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పాత్రాలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారతదేశంలో కుల వివక్ష, లింగ అసమానతలకు వ్యతిరేకంగా వారి పోరాటాన్ని, మహిళా విద్య, పేదల హక్కుల కోసం వారు చేసిన కృషిని వివరిస్తుంది. ‘ఫూలే’ బయోపిక్ కోసం ఏప్రిల్ 2025లో ముంబైలో పలు స్పెషల్ స్క్రీనింగ్‌లు జరిగాయి.

ఈ స్పెషల్ స్క్రీనింగ్ లకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సామాజిక కార్యకర్తలు, మరియు సాధారణ ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ బయోపిక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా పంజాబ్ వంటి ప్రాంతాలలో షోలు హౌస్ఫుల్ అయ్యాయి. దీనితో ఈ బయోపిక్ ను తెలుగులో అనువదించారు.నేడు(జనవరి 5) సాయంత్రం 5:00 గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో హిందీ నుండి తెలుగులోకి అనువదించిన “పూలే” సినిమా ప్రదర్శించబడుతుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Bhatti Vikramarka) , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>