కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర శివారు దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండల పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పక్కా పథకం ప్రకారం దుండగులు యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది.
మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ (26) అనే యువకుడు ఈ దారుణ హత్యకు బలైపోయాడు. బుధవారం రాత్రి శంషాబాద్ (Shamshabad) మండలం కవేలిగూడ గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో మహేష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మహేష్ గొంతు కోయడంతో, తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మహేష్‌కు ఒక మహిళతో ఉన్న పరిచయం కారణంగానే ఈ ఘాతుకం జరిగి ఉండవచ్చని సమాచారం.
Read Also: కేసీఆర్, రేవంత్ భాషపై ‘సోషల్’ డిబేట్
Follow Us On: Pinterest


