Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. వణికిపోయిన స్కూల్ పిల్లలు

కలం, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్‌ (Philippines) దేశాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల ధాటికి జనాలు బెంబేలెత్తిపోయారు. బరంగాయ్ కిలాగ్ పట్టణంలోని మహాయహాయ్ ఎలిమెంటరీ స్కూల్‌లో భూకంపం పిల్లలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. భూమి కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం ప్రార్థన చేసేందుకు విద్యార్థులు బయటకు రాగా.. భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు ఇలాగే జరగగా.. పక్కనే ఉన్న ఒక వేదిక లాంటి నిర్మాణం విరిగి పిల్లలపై శిథిలాలు పడిపోయాయి.

పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి, శిథిలాలు తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. భూకంప తీవ్రతకు పిల్లలు భయపడుతుంటే, టీచర్లు వారిని గట్టిగా పట్టుకోవడం.. భయపడొద్దంటూ జాగ్రత్తలు చెబుతుండటంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: ఘోర విమాన ప్రమాదం: రన్‌వేపై పేలిన ప్రైవేట్ జెట్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>