Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ హిట్లర్ కన్నా ఎక్కువ.. ఆయన తాలిబన్: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్ (CM Revanth) వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యాశాఖ పై రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయాడని.. సర్కస్ లెక్క విద్య శాఖను మార్చేశాడని ఫైర్ అయ్యారు. కేవలం 4 వేలస్కూళ్లను మాత్రమే నడిపిస్తానంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదని.. అంతకన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక తాలిబన్ అని.. అందుకే ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని అంటున్నారని విమర్శించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లు చేపట్టాలని ఇంటర్ బోర్డు అనుమతినిచ్చిందని చెప్పారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా.. ప్రభుత్వ, ప్రవేట్ జూనియర్ కాలేజీలకు ఈ ప్రభుత్వం కనీసం అఫిలియేషన్ లు ఇవ్వలేదని మండిపడ్డారు.

జీవో నెంబర్ 7ను రద్దు చేయాలి..

డిగ్రీ అడ్మిషన్లను సైతం గందరగోళంగా మార్చేశారని కవిత దుయ్యబట్టారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫార్సు చేస్తే.. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ మరికొన్ని కోర్సులు రిఫర్ చేసిందని చెప్పారు. వాటిలో ఏ ఒక్క కోర్సుకు కూడా యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వలేదని.. అయినా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా ఈ ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. రూ.11 వేల కోట్ల ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 7 తీసుకువచ్చారని చెప్పారు. ఈ జీవో కారణంగా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదముందని.. వెంటనే జీవో నెంబర్ 7 (GO No.7)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>