Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర విమాన ప్రమాదం: రన్‌వేపై పేలిన ప్రైవేట్ జెట్!

కలం, వెబ్ డెస్క్ : డొమినికన్ రిపబ్లిక్‌లో ఒక ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లా రొమానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన ఒక ప్రైవేట్ జెట్ విమానం రన్‌వేపై కుప్పకూలింది (Private Jet Crash). విమానం భూమిని తాకిన మరుక్షణమే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో ప్రైవేట్ జెట్ పూర్తిగా కాలిపోయింది (Private Jet Crash). విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి చివరి నిమిషం వరకు పోరాడిన పైలట్, కో-పైలట్ ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, రన్‌వేపై విమానం పేలిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read Also: నేడు ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి సమావేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>