కలం, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం భారీగా తగ్గిన పుత్తడి ధరలు సోమవారం సైతం భారీ తగ్గుదలను కనబర్చాయి. గోల్డ్ రేట్స్ తగ్గడంతో పుత్తడి ప్రియుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 పతనమై రూ.1,51,690కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 తగ్గి రూ.1,39,050 పలుకుతోంది. ఆదివారం ఒకేరోజు రూ.3000 తగ్గగా.. కేవలం 5 రోజుల్లోనే రూ.7,950 తగ్గుదల నమోదవడం గమనార్హం. అటు సోమవారం సిల్వర్ ధర రూ. 5000 తగ్గి రూ.2,60,000గా ఉంది.
బంగారం, వెండి ధరలు (Gold Silver Prices) వివిధ నగరాల్లో హెచ్చుతగ్గులు కనబర్చాయి. 24 క్యారెట్ల ఒక గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.15,349, ముంబైలో రూ.15,169, ఢిల్లీలో రూ.15,184, కలకత్తాలో రూ.15,169, బెంగుళూరులో రూ.15,169, హైదరాబాద్ లో రూ.15,169, పూణేలో రూ.15,169, అహ్మదాబాద్ లో రూ.15,174గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కేజీ వెండి చెన్నైలో రూ.2,70,000, ముంబైలో రూ.2,60,000, ఢిల్లీలో రూ.2,60,000, కలకత్తాలో రూ.2,60,000, బెంగుళూరులో రూ.2,60,000, హైదరాబాద్ లో రూ.2,70,000, కేరళలో రూ.2,70,000, పూణేలో రూ.2,60,000, వడోదరలో రూ.2,60,000, అహ్మదాబాద్ లో రూ.2,60,000గా నమోదయింది.
Read Also: ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భేటీ.. కీలక చర్చ
Follow Us On: X(Twitter)

