ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. తప్పిన పెను ప్రమాదం..!

కలం, వెబ్ డెస్క్ : వెనుజువెలాలో సంభవించిన భారీ భూకంపం వల్ల నెలకొన్న విషాదఛాయల్ని మరువక ముందే మరో దేశంలో భారీ భూకంపం చోటు చేసుకోవడం తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. ఫిలిప్పీన్స్ (Philippines Earthquake)లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిందనౌలో రెక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.

29 కిలోమీటర్ల లోతులు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) సర్వే వెల్లడించింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా, కొన్నివారాల క్రితం ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించి 80 మందికి పైగా మృతి చెందారు. అయితే ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం తర్వాత జొల్లిబీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కుప్పకూలింది. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన సిబ్బంది అందరినీ ఖాళీ చేయించి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>