ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్.. తప్పిన పెను ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి (Medipally) వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. పెట్రోల్‌తో నిండిన హెచ్‌పీ ట్యాంకర్ లారీ అదుపుతప్పి ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నంబర్–102ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్యాంకర్ ముందు భాగం దెబ్బ తినగా.. డ్రైవర్ కు స్వల్ప గాయలయ్యాయి. డ్రైవర్ ను స్థానికులు వెంటనే సమీపంలోని అపెక్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

అయితే ప్రమాద సమయంలో అదృష్టవశాత్తూ ట్యాంకర్ నుంచి ఎలాంటి ఇంధన లీకేజీ కాలేదని.. లేదంటే మంటలు చెలరేగి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉండేదని స్థానికులు అంటున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read Also: గులాబీ రేకులతో మెరిసే చర్మం.. ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>