Mobile Popup Ad
Mobile Popup Ad

రిటైర్మెంట్‌పై స్టార్క్ క్లారిటీ.. గాయాలు తనను ఆపలేవంటూ రిప్లై!

కలం, వెబ్‌డెస్క్: సుమారు మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc), తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. గాయాల కారణంగా ఆటకు దూరమైన ఆయన, తిరిగి రాకముందే రిటైర్ అవుతారంటూ జరిగిన ప్రచారాన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. భుజం, మోచేతి గాయాల నుండి కోలుకున్న స్టార్క్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాత స్టార్క్‌ను గుర్తుచేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేసి రాజస్థాన్‌కు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత తన అనుభవాన్నంతా ఉపయోగించి 17వ ఓవర్లో ప్రమాదకరమైన రియాన్ పరాగ్, రవీంద్ర జడేజాలను పెవిలియన్ పంపారు. మొత్తంగా 3/40 గణాంకాలతో తన విలువేంటో చాటుకున్నారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఫిట్‌నెస్‌పై స్పందించిన స్టార్క్, కాళ్లకు కట్టు కట్టుకున్నంత మాత్రాన రిటైర్మెంట్ గురించి ఆలోచించనని స్పష్టం చేశారు. “కాళ్లకు మూడు కట్లు ఉన్నాయని రిటైర్మెంట్ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది, నేను ఇంకా ఆ దశకు చేరుకోలేదు” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. క్రికెట్ ప్రపంచంలో గాయాలు సహజమని, వాటిని దాటుకుని ముందుకు వెళ్లడమే ముఖ్యమని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా తాను ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయలేదని, కేవలం గాయం నుండి కోలుకోవడానికి మోచేతి కదలికలపై దృష్టి పెట్టానని స్టార్క్ వెల్లడించారు. నేరుగా మ్యాచ్‌లోనే బ్యాటర్లను ఎదుర్కోవడం సవాలుగా అనిపించినా, వేగంగా లయ అందుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జట్టు విజయంలో భాగస్వామి కావడం, మళ్లీ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆయన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>