కలం, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది (Peddi) టికెట్ ధరల పెంపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ధరల పెంపులో జీవో 151 నిబంధనలు పాటించలేదని సదరు వ్యక్తి పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ జూన్ 2న టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేశారని పిటిషనర్ ఆరోపించారు. దీంతో నేడు హైకోర్ట్ టికెట్ ధరల పెంపు జీవో చట్టబద్ధతపై విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: ఫిఫా సంబురం.. గ్యాలరీలోనే భారతం
Follow Us On: X(Twitter)

