ప్రధాని మోడీ రికార్డు.. తిరుమల హిల్స్‌లో బీజేపీ నేతల పూజలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారతదేశ చరిత్రలో ప్రజలచే ఎన్నికై అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్న నేతగా నరేంద్ర మోడీ (Narendra Modi) సరికొత్త రికార్డు సృష్టించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతి కుమార్ (Bandari Shanthi Kumar) కొనియాడారు. మోడీ నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధి, సంక్షేమం, సుశాసనానికి గుర్తింపుగా పార్టీ పిలుపు మేరకు మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) లోని తిరుమల హిల్స్‌లో ఉన్న శ్రీ త్రినేత్ర దశభుజ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు బండారి శాంతికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం & “వికసిత భారత్ – 2047” లక్ష్య సాధనలో ప్రధాని మోడీ నాయకత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంబిరాజు, రాజేందర్ రెడ్డి, గూడెం నారాయణ, సాయిరాం, మఠం మయూర్నాథ్, ఆంజనేయులు, సూర్యనారాయణ, అవినాష్, సుధీర్ రెడ్డి, దోమ సాయి, మధు, శివరెడ్డి, పృథ్వీ చారి తదితర నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Read Also: ఫిఫా సంబురం.. గ్యాలరీలోనే భారతం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>