ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతి: పెమ్మసాని చంద్రశేఖర్‌

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) మాట్లాడారు. ఆంధ్రుల రాజధాని అమరావతిపై అంటూ తెలుగులో తన ప్రసంగం చేశారు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతి చిరస్థాయిలో నిలిచి ఉంటుందన్నారు. అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం తన అదృష్టమని పేర్కొన్నారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని, పోరాడిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషిచేశారని కొనియాడారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని పెమ్మసాని (Pemmasani Chandrasekhar) పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) అనుమతితో సభలో చర్చ ప్రారంభమైంది. బిల్లుపై గంటసేపు చర్చించేందుకు స్పీకర్‌ అనుమతినిచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్‌ తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ తరపున కేంద్రాన్ని కోరారు.

Read Also: విశాఖ‌ను రాజ‌ధాని చేస్తే ఇంత ఖ‌ర్చ‌య్యేది కాదు: ఎంపీ ధ‌ర్మేంద్ర యాద‌వ్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>