రిలీజ్‌కు ముందే రికార్డుల మోత.. నెం. 1 ట్రెండింగ్‌లో ‘పెద్ది’

కలం, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi Trailer)ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలకి అన్ని భాషల్లో కలిపి ఏకంగా 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మొట్టమొదటి తెలుగు ట్రైలర్‌గా, యూట్యూబ్ మూవీస్ ట్రెండింగ్ చార్ట్‌లో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది. రామ్ చరణ్ ఊరమాస్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌ను నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌లో నిలిపాయి.

రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే .. ‘పెద్ది’ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ భారీ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>