పెట్రోల్ ధరలు పెంచడం బాధాకరం : అనంతుల రమేశ్

కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని, నమ్మక ద్రోహమని కాంగ్రెస్ నాయకుడు అనంతుల రమేశ్  (Ananthula Ramesh) మండిపడ్డారు. ఎన్నికలు ముగియ గానే ఇంధన ధరలు పెంచడం దారుణమని, ఇది ముమ్మాటికీ ప్రజలను వంచించడమేనని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందని ఆయన (Ananthula Ramesh) విమర్శించారు.

‘కేంద్రం చెబుతున్న ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. దేశానికి ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలో యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితిదాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కేంద్ర హామీ ఒట్టి మాటగానే మిగిలిపోయింది. గత పదేండ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది’ అని రమేశ్ అన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యులపై భారం మోపడమేనన్నారు దుయ్యబట్టారు.

ఈ పెంపు కారణంగా రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయని, ఇది సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని ఆయన మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని, ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకమేని రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>