Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు బెంగళూరులో “పెద్ది” టీం ప్రెస్‌మీట్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది'(PEDDI) . ఫ్యాన్స్ ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్‌తో సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి నేడు (మే 25) బెంగళూరులో ఘనంగా ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

మూవీ యూనిట్ ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేయగా, అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. “నమ్మ బెంగళూరు… PEDDI is coming today” అంటూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హైప్ రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రెస్‌మీట్‌ను అభిమానులు ఆన్‌లైన్‌లో కూడా వీక్షించవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సినిమా అప్‌డేట్స్, కాస్ట్ అండ్ క్రూ వివరాలు, ప్రమోషనల్ విషయాలు మేకర్స్ పంచుకోనున్నారు. ఇటీవల భోపాల్‌లో జరిగిన పెద్ది భారీ మ్యూజికల్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కావడంతో.. చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>