Mobile Popup Ad
Mobile Popup Ad

జనగామలో ఉద్రిక్తత.. వడ్ల కుప్పకు నిప్పు పెట్టిన రైతు!

కలం, వెబ్‌డెస్క్: వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఓ రైతు వడ్లను తగలబెట్టిన ఘటన జనగామ (Jangaon) జిల్లాలో చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెంలోని ఐకేపీ సెంటర్‌లో చెట్టిరెడ్డి నర్సింహారెడ్డి అనే రైతు వడ్లను తగలబెట్టాడు. ఐకేపీ సెంటర్‌లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనకపోవడంతో ఈ రకంగా నిరసన తెలిపాడు.

ఐకేపీ కేంద్ర నిర్వాహకులు లంచాలు ఇచ్చిన వారికే టోకెన్లు ఇస్తూ అవినీతికి పాల్పడుతుండటంతో, వారి చేతివాటంతో విసుగు చెందిన రైతు నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని రైతు డిమాండ్ చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>