Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ లో భారీ మార్పులు.. కొత్త వెర్షన్‌కు రంగం సిద్ధం ?

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) సినిమా జూన్ 4న విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌తో  సక్సెస్‌ఫుల్‌గా  దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాలలో  చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సీన్స్‌కు నెగెటివ్ టాక్ రావడంతో ఆ సీన్స్ తొలగిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సెన్సార్ ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా సినిమాలో కొన్ని కీలక మార్పులు చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ‘పెద్ది’ సినిమాలో ప్రస్తుతం సెన్సార్ అయిన వెర్షన్‌లోని కొన్ని సన్నివేశాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సన్నివేశాలను జోడించనున్నారు. అందులో భాగంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించి కొన్ని సన్నివేశాలలో మార్పులు చేయడంతో పాటు సెకండాఫ్‌లోని కొన్ని భాగాలను తగ్గించి, రామ్ చరణ్ – జగపతి బాబు పాత్రల మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్‌ను మరింత బలంగా చూపించే సన్నివేశాలను జోడించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ మార్పులు తుది రూపం దాల్చితే, కొత్తగా సిద్ధం చేసిన వెర్షన్‌ను మరోసారి సెన్సార్‌కు పంపించి, ఆ తర్వాత థియేటర్లలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>