Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే!

కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్–జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ‘పెద్ది’ (Peddi) మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన రిలీజ్ డేట్ అనౌన్స్ ఈవెంట్‌‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ ఆవిష్కరించి.. విడుదల తేదీని ప్రకటించారు. మొహం నిండా రక్తంతో ఉన్న ఈ ఫొటో.. మూవీలో ఉన్న హై ఓల్టేజీ యాక్షన్ ఎలా ఉండబోతుందో చెబుతుంది.

ప్రమోషన్స్ సందడి షురూ..

ఇటీవలే రామ్ చరణ్​–శ్రుతి హాసన్ మీద ప్రత్యేక పాటను తెరకెక్కించడంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక నుంచి వరుసగా ప్రమోషన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, ముంబయి, కొచ్చి, చెన్నైలో భారీ ఈవెంట్లు నిర్వహించబోతున్నారు. నార్త్ మీడియాలో ఇంటర్వ్యూలు కూడా ప్లాన్‌ చేశారట. హైదరాబాద్‌లో జరిగే ప్రీ–ఈవెంట్ వేడుక సైతం అత్యంత భారీగా ఉండబోతుందనేది మూవీ (Peddi) వర్గాల మాట.

Read Also: యూపీఐకి పదేళ్లు.. చెల్లింపుల్లో గొప్ప విప్లవం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>