యూపీఐకి పదేళ్లు.. చెల్లింపుల్లో గొప్ప విప్లవం!

కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు చేతులో డబ్బులు ఉంటే గానీ బయటకు వెళ్లలేని జనాలు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉందా.. లేదా.. అని చెక్ చేసుకుని బయటకు వెళ్తున్నారు. బ్యాంకుల వద్ద ఒకప్పుడు బారులు తీరిన వారు.. ఇప్పుడు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. డబ్బులు వేయాలన్నా.. పంపించాలన్నా.. అంతా అర చేతిలో స్మార్ట్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతోంది. దానికి ప్రధాన కారణం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, సింపుల్‌గా యూపీఐ (UPI) అంటుంటాం. ఈ వ్యవస్థ 2016, ఏప్రిల్ నెలలో అందుబాటులోకి రాగా, పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణాన్ని సమూలంగా మార్చేసిన యూపీఐని మహా విప్లవంగా నిపుణులు అభివర్ణిస్తుంటారు.

ఒక నెలలో రూ.15 లక్షల కోట్లు..

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం, మన దేశంలో ప్రతి నెలా 1000 కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.15 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే, ప్రపంచంలో జరిగే తక్షణ చెల్లింపుల్లో సగం మన దేశంలోనే జరుగుతున్నాయని పేర్కొంది. అంతేగాకుండా, వినియోగదారులకు పూర్తి భద్రత కల్పించడంలో, అధునాత సెక్యూరిటీ ఫీచర్లు అందించడంలో యూపీఐ (UPI) యాప్స్ సత్తా సాటిలేనిది. ఈ పేమెంట్స్ విధానం ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తోంది. అందుకే, సింగపూర్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా వంటి దేశాల్లోనూ మన యూపీఐ సేవలు అందిస్తోంది. విదేశీ నేతలు ఎవరొచ్చినా.. వారు సైతం స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తూ.. ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఒక ఉద్యమంలా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>