కలం, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur) నగరంలో కలకలం రేపిన ఘటన లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏటుకూరు రోడ్డులోని పాత సామాను దుకాణం ముందు నిద్రిస్తున్న రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అపహరణకు ముందు బాధితులకు, ఆ యువకులకు మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లాలాపేట పోలీసులు పసికందు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

