Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు అనుమతి!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని సినీ ప్రియులకు ఒకవైపు పండగ లాంటి వార్త, మరోవైపు జేబుకు చిల్లు పడే వార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (Peddhi movie) సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శనకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరను భారీగా రూ.600 గా నిర్ణయించారు.

ప్రీమియర్ షోలకే కాకుండా, సినిమా రెగ్యులర్ టికెట్ ధరల పెంపునకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.100, అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పెంచిన టికెట్ ధరలు సినిమా విడుదలైన రోజు నుండి మొత్తం పది రోజుల పాటు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని థియేటర్లలో చూడాలనుకునే ప్రేక్షకులకు అదనపు భారం తప్పేలా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>