కలం, వరంగల్ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమంలో (Childrens Prajavani Program) కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో ఆమె నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తమకు ఎదురవుతున్న సమస్యలను స్వేచ్ఛగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి చిన్నారి చెప్పిన అంశాన్ని కలెక్టర్ శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, విద్య, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. పిల్లలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను తెలియజేసేందుకు పిల్లల ప్రజావాణి (Childrens Prajavani) వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నారుల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాలల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.
Also Read : తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వేడుకలో సినీ ప్రముఖల సందడి
Follow Us On : WhatsApp

