కలం, వెబ్ డెస్క్: మద్యం దుకాణ యజమానులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు విక్రయాలు జరపాలని సూచించారు. రాష్ట్రంలోని కాకినాడ సహా కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆయా దుకాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎం.ఆర్.పి కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం విక్రయాల విషయంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోరారు. మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి, అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచనలు చేశారు.
Read Also: అంబటి, జోగి రమేశ్‌లను పరామర్శించనున్న జగన్
Follow Us On: Instagram


