కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు (Tumati Madhava Rao) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధికారికంగా సభలో ప్రకటించారు.
మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం ఛైర్మన్ మోషేన్ రాజు ఈ వివరాలను వెల్లడించారు. అనంతరం నూతన డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావును ఛైర్మన్ స్థానం వద్దకు వైసీపీ సభ్యులు గౌరవపూర్వకంగా తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

