కలం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అస్వస్థకు గురవడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఎక్స్ వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పవన్ కల్యాణ్ శనివారం అధికారులతో సమావేశంలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లి పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. దీంతో శనివారం రాత్రి సర్జరీ చేయించుకొని ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయన త్వరగా కోలుకోవాలని ఓ పోస్ట్ చేశారు. ఇక జగన్ పవన్ కోసం పోస్టు పెట్టడంపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో జగన్‌పై ఓ ప్రచార సభలో దాడి జరిగి గాయమైతే పవన్ ఆ ఘటనపై సెటైర్లు వేశారు. దీంతో పవన్ తీరును నెటిజన్లు తప్పు పడుతున్నారు. రాజకీయంగా ఎన్ని విబేధాలున్నా ఇలాంటి సమయంలో జగన్ హుందాగా వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు.

