కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యతో శనివారం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. దీంతో పవన్ కళ్యాణ్ కు వైద్యులు శనివారం శస్త్ర చికిత్స చేశారు. ఆదివారం ఆసుపత్రి నుంచి ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన శ్రేణులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు , అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం అధికారులతో పాలనపరమైన విషయాలపై చర్చిస్తున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ చేరారు. పలు పరీక్షల అనంతరం సర్జరీ తప్పనిసరి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో పవన్ కళ్యాణ్ కు వైద్యులు సర్జరీ చేశారు.

