కలం, కరీంనగర్ బ్యూరో : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) త్వరలోనే కొండగట్టుకు (Kondagattu) రాబోతున్నారు. ఈ క్రమంలోనే కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల నిధులను టీటీడీ కేటాయించేలా సిఫార్స్ చేశారు. త్వరలోనే టీటీడీ(TTD) బోర్డు అధికారికంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ ఉపయోగించిన ‘వారాహి’ వాహనానికి కొండగట్టులో పూజ చేయించారు. ఆ సమయంలోనే ఆలయంలో 100గదుల నిర్మాణంతో పాటు మాలధారణ మండపం కట్టించాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఆ క్రమంలోనే పవన్ (Pawan Kalyan) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు కొండగట్టుకు వచ్చి స్థల పరిశీలన కూడా చేశారు. నూతన నిర్మాణ పనుల శంకుస్థాపనకు త్వరలో పవన్ కల్యాణ్ కొండగట్టు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది.
Read Also: యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు : డిప్యూటీ సీఎం పవన్
Follow Us On: Instagram


