కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh) రిలీజ్ కి సిద్దమైంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
రీసెంట్‌గా ట్రైలర్ టీజ్‌తో ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా “కలర్ ఏ ఎత్తరా “(Collar Ey Etthara) అనే మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. పవర్ స్టార్ మాస్ స్టెప్స్ మరోసారి ఆకట్టుకోగా.. ఫుల్ సాంగ్‌ను మార్చి 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) మ్యూజిక్ అందించగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ ఉగాదికి పవర్ స్టార్ నుంచి పవర్ ప్యాక్డ్ మూవీ రానుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: నేషనల్ క్రష్ రష్మిక మనసు దోచిన దుస్తులివే..
Follow Us On: Instagram

