కలం, మెదక్ బ్యూరో : మెదక్(Medak) జిల్లాలోని తూప్రాన్ పోలీస్ స్టేషన్(Toopran Police Station)లో దంపతుల మధ్య వివాదం పెద్ద రచ్చకు దారి తీసింది. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన జ్యోతికి, చేగుంట మండలం రాంపూర్‌కు చెందిన ఉదయ్ కిరణ్‌తో వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొని తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త తనను కొడుతున్నాడని ఆరోపిస్తూ.. భార్య జ్యోతి తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న భర్త ఉదయ్ కిరణ్ కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి భార్యను తనతో పంపించాలని పట్టుబట్టాడు. దీంతో అక్కడే వాగ్వాదం మొదలైంది.
ఇద్దరి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు (Toopran Police Station) చేరుకోవడంతో గొడవ క్రమంగా ఘర్షణగా మారింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఇరు కుటుంబాలను నియంత్రించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఉద్రిక్తత తగ్గకపోవడంతో చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: రాహుల్ గాంధీకి కవిత సంచలన లేఖ
Follow Us On: Sharechat

