epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శభాష్ కలెక్టర్.. కృతిక శుక్లాపై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు తన శాఖలను సమర్థమంతంగా నిర్వరిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆకస్మిక పర్యటనలు చేస్తూ.. ఆయా డిపార్టమెంట్లను తనిఖీ చేస్తూ అధికారులను పరుగులు తీయిస్తున్నారు. అయితే తప్పు చేసిన అధికారులను మందలిస్తూనే, సమర్థమంతమైన అధికారులను బహిరంగంగా మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు భాష కోసం విస్తృతంగా పనిచేస్తున్న పల్నాడు కలెక్టర్ కృతిక షుక్లా(Kritika Shukla)ను ప్రశంసించారు.

చిలకలూరిపేటలోని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. శుక్ల కలెక్టర్ అయినప్పటికీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతారని, ఆమె మాటలకు, భాషకు చాలా ప్రభావితుడయ్యారని పవన్ కల్యాణ్ చెప్పారు. మీరు ఇక్కడనే పుట్టారా?’ అని అడిగానని, ఆమె ఆమె హర్యానా నుండి వచ్చినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయానని అన్నారు. తెలుగులో చాలా సహజంగా మాట్లాడుతున్నారని, ఆమె భాష గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చాలా దగ్గర ఉందన్నారు. ఏపీలో పుట్టి చాలామంది నేటికీ మాతృభాషలో సరిగ్గా మాట్లాడలేరని పవన్(Pawan Kalyan) ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే మరొక రాష్ట్రం నుంచి వచ్చిన వారు తెలుగు నేర్చుకొని, ధైర్యంగా మాట్లాడడం నచ్చందని పవన్ కళ్యాణ్ కితాబు ఇచ్చారు. ఆమె తెలుగు భాషపై కలెక్టర్ చూపే ప్రేమకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.

2013 బ్యాచ్ IAS అధికారిణి అయిన శుక్లా రాష్ట్ర పరిపాలనలో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఆమె ఇంటర్మీడియట్, వయోజన విద్య డైరెక్టర్‌గా, అలాగే ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శిగా (2024–25) పనిచేశారు. గతంలో, ఆమె కాకినాడ కలెక్టర్‌గా పనిచేశారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జువెనైల్ వెల్ఫేర్, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, APDASCACలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె కృష్ణ, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా, మదనపల్లె సబ్-కలెక్టర్‌గా విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు.

Read Also: ఖమ్మంలో చంద్రబాబు సతీమణికి షాకిచ్చిన పోలీసులు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>