కలం, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత మరో సినిమా రాదని. పవన్ రాజకీయంగా బిజీగా ఉంటారని.. చాలా వార్తలే వచ్చాయి. కానీ ఆ రూమర్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ తాజాగా పవన్ కొత్త సినిమా ప్రకటన విడుదల అయింది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన నూతన నిర్మాణ సంస్థ జైత్ర రామ మూవీస్ కింద ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు..వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు.అయితే ఈ సినిమా కథ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ,ఇందులో పవన్ కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల పవన్ తన లుక్ ను చేంజ్ చేశారు ..అచ్చం ఆర్మీ వాళ్ళ లాగా పవన్ హెయిర్ స్టైల్ ఉంది..అయితే మొన్నటి వరకు ఈ హెయిర్ స్టైల్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసమని అంతా భావించారు..కానీ ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిపోవటంతో ఈ హెయిర్ స్టైల్ దేని కోసమా అని అంతా అనుకున్నారు..తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నూతన సినిమా ప్రకటన రావడంతో పవన్ హెయిర్ స్టైల్ వెనుక వున్న సీక్రెట్ తెలిసిపోయింది.గత ఏడాది “ఓజీ”తో సూపర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు..అయితే పవన్ కళ్యాణ్ త్వరలో సుజీత్ తో “ఓజీ 2” చేయనున్నట్లు కూడా ప్రకటించారు.. అయితే ప్రస్తుతం “ఓజీ 2” ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


